మళ్ళీ వెనక్కి వెళ్ళిన ‘సైజ్ జీరో’.!

మళ్ళీ వెనక్కి వెళ్ళిన ‘సైజ్ జీరో’.!

Published on Oct 4, 2015 7:40 PM IST

size-zero1
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, హాట్ బ్యూటీ అనుష్క నటించిన క్రేజీ ప్రాజెక్ట్స్ వరుసగా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. అవే ‘రుద్రమదేవి’ మరియు ‘సైజ్ జీరో’. అక్టోబర్ 9న వరల్డ్వైడ్ గా నాలుగు భాషల్లో రుద్రమదేవి రిలీజ్ కానుంది. ఇది కాకుండా అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా కూడా అన్ని కార్యక్రమాలను రిలేజే చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇటీవల్ ఈఎ చిత్ర టీం ఈ సినిమాని కూడా అక్టోబర్ 9నే రిలీజ్ చేయనున్నాం అని అనౌన్స్ చేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కావడం లేదు. రుద్రమదేవి లాంటి సినిమాకి సోలో రిలీజ్ ఇవ్వడం కోసం సైజ్ జీరో టీం వెనక్కి వెళ్ళినట్లు సమాచారం.

ఈ విషయంపై సైజ్ జీరో టీం నుంచి అధికారిక అనౌన్స్ మెంట్ తో పాటు న్యూ రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సినిమాని ముందుగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు, ఆ తర్వాత అక్టోబర్ 9కి వచ్చింది, ఇప్పుడు అక్కడి నుంచి కూడా వాయిదా పడింది. ఇన్ని రోజులు హైట్ కి తగ్గా బాడీతో హాట్ గా కనిపించిన అనుష్క ఈ సినిమాలో బాగా బొద్దుగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం తను 20 కేజీల వెయిట్ కూడా పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ లో అనుష్క లుక్ అందరినీ సర్ప్రైజ్ అయ్యేలా చేసింది.

అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాని పివిపి బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు