లయన్ తో ఢీకొట్టనున్న చిన్న సినిమా..

లయన్ తో ఢీకొట్టనున్న చిన్న సినిమా..

Published on Apr 21, 2015 10:26 AM IST

balayya-lion
నందమూరి బాలకృష్ణ నటించిన 98వ చిత్రం ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంటుంది. సత్య దేవా దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను అదే రోజున మరో చిన్న చిత్రం ఢీ కొట్టనుంది.

తమిళంలో ఘన విజయం సాధించిన ‘శైవం’ సినిమాను తెలుగులో ‘దాగుడుమూతల దండాకోర్’ గా రీమేక్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాలో అచ్చ తెలుగు మమకారాన్ని, ఆప్యాయతను చూపించినట్టు సమాచారం. ఒరిజినల్ మాతృక తెగ నచ్చేయడంతో దర్శకుడు క్రిష్ నిర్మాతగా మారి రామోజీ రావుగారితో కలిపి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు