‘ధృవ’, ‘సింగం 3’.. మధ్యలో చిన్న సినిమాలు..!!

‘ధృవ’, ‘సింగం 3’.. మధ్యలో చిన్న సినిమాలు..!!

Published on Dec 2, 2016 6:18 PM IST

nanna-nenu-na-boy-frhds-mel
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ డిసెంబర్ 9న భారీ ఎత్తున విడుదలవుతోన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ‘ధృవ’కు సరిగ్గా వారం తర్వాత సూర్య ‘సింగం 3’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాల్సింది. కాగా తాజాగా ‘సింగం 3’ని కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 23కు వాయిదా వేశారు. దీంతో డిసెంబర్ 23కు వస్తాయనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు వారం ముందుగానే వచ్చేందుకు సిద్ధమవ్వడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి.

కమెడియన్ పృథ్వీ ఓ కీరోల్ చేయగా బాగా ఆసక్తి రేకెత్తించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాను డిసెంబర్ 23నుంచి డిసెంబర్ 16కు మార్చేశారు. ఇక హెబ్బా పటేల్ హీరోయిన్‌గా చేసిన ‘నాన్న, నేను, నా బాయ్‌ఫ్రెండ్స్’ కూడా వారం ముందే వస్తూ డిసెంబర్ 16కు ఫిక్స్ అయింది. ఇవేకాకుండా ఈనెల్లో విడుదలకు ఎదురుచూస్తోన్న సినిమాలన్నీ ఇప్పుడు డిసెంబర్ మూడో వారంపైనే కన్నేశాయి. రెండు పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు దారి వెతుక్కుంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు