మార్చి 15న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో

మార్చి 15న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో

Published on Mar 5, 2015 6:00 PM IST

Trivikram-alluarjun1

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియోను మార్చి 15న విడుదల చేస్తున్నారు. యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ – బన్నిల కలయికలో ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ మ్యూజికల్ హిట్స్ సాదించాయి. బన్ని అతిధి పాత్రలో నటించిన ‘ఎవడు’ సినిమాకు సైతం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా ఆడియోపై భారి అంచనాలు ఉన్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు