‘ఆత్మ’ల కాన్సెప్ట్ తో రానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’

‘ఆత్మ’ల కాన్సెప్ట్ తో రానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’

Published on Aug 29, 2015 10:34 PM IST

soggade_chinni_nayan-(1)
55 ఏళ్ళ వయసులో కూడా 22 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ టాలీవుడ్ నవయువ మన్మధుడుగా వరుసగా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. కెరీర్ ప్రారంభం నుంచి సరికొత్త కథలకి ఎప్పుడూ స్వాగతం పలికే నాగార్జున ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాడు. నాగార్జున చేస్తున్న లేటెస్ట్ డిఫరెంట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. నాగ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండు డిఫరెంట్ పాత్రల్లో నాగార్జున లుక్ మరియు తన డైలాగ్ లోని యాస అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ఆడియన్స్ ని మరింత ఆసక్తికి గురి చేస్తున్న విషయం ఈ సినిమా ఆత్మల బ్యాక్ డ్రాప్ లో రానుంది. నాగార్జున ద్విపాత్రాభినయంలో తండ్రీ కొడుకుల్లా కనిపిస్తారు. అందులో తండ్రి పాత్ర అయిన సోగ్గాడు చనిపోయి ఒక ఆత్మలా మారి తన కొడుకుకి మాత్రమే కనిపిస్తుంటాడు. ఆత్మ అయిన సోగ్గాడు అమాయకుడైన తన కొడుకుకి మధ్య జరిగే ఎపిసోడ్స్ చాలా చాలా ఫన్నీగా ఉంటాయని నాగార్జున తెలిపాడు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు విజయవంతం అయ్యాయి వాటిలానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు