సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో ఎం ఎస్ ధోని.!

సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో ఎం ఎస్ ధోని.!

Published on Oct 1, 2020 12:10 PM IST

ఒక అద్భుతమైన ఆటగాడిగాను అంతకు మించిన జట్టు సారధిగా ఎం ఎస్ ధోని కోసం తెలియని వారు ఉండరు. అలాగే ధోనీ ఇప్పటి వరకు నటునిగా అనేక యాడ్స్ లో కూడా కనిపించాడు. అయితే ఎం ఎస్ ధోని ఎంటర్టైనింగ్ రంగంలో కూడా దిగిన సంగతి తెలిసిందే.

ఎం ఎస్ ధోని ఎంటర్టైన్మెంట్స్ ను అతని భార్య సాక్షి ధోని చూసుకుంటుంది. అయితే గత ఏడాది వీరి నిర్మాణ సారధ్యంలో “రోర్ ఆఫ్ ది లయన్” అనే డాక్యుమెంటరీను విడుదల చేయగా ఇస్రాయి మాత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో రానున్నారట.

ఇపుడు ధోని ప్రొడక్షన్స్ లో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ ను అలాగే స్కై ఫై తరహా వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నారట. అది కూడా చాలా బెటర్ క్వాలిటీతో సినిమాలను తలదన్నే రేంజ్ లో తెరకెక్కిస్తారని టాక్. మొత్తానికి ధోని నుంచి ఈ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కూడా రానుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు