వర్మ సినిమా శాటిలైట్ రైట్స్ కి బంపర్ ప్రైజ్

వర్మ సినిమా శాటిలైట్ రైట్స్ కి బంపర్ ప్రైజ్

Published on Nov 29, 2015 7:23 PM IST

killing-veerappan
దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్. చాలా రోజులు అతన్ని వేటాడి చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రావడం వలన ‘కిల్లింగ్ వీరప్పన్’పై మొదటి నుంచి అంచనాలున్నాయి. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే ఈ సినిమాని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రిలీజ్ ముందే ఉన్న క్రేజ్ వలన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ లీడింగ్ చానల్ 3.5 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, కన్నడమ తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో కలిపి సుమారు 2000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు