‘నో పెళ్లి’ అంటూ రానా, వరుణ్ తేజ్ లతో ‘సాయి తేజ్’.. !

‘నో పెళ్లి’ అంటూ రానా, వరుణ్ తేజ్ లతో ‘సాయి తేజ్’.. !

Published on May 25, 2020 12:41 PM IST

‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో ఇప్పుడిప్పుడే తేరుకున్న తేజ్ ఆ తరహాలోనే ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి వీడియో సాంగ్‌ ‘నో పెళ్లి’ నితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. పెళ్లి చేసుకోవ‌ద్దు అంటూ సాగే ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కనిపించి ఆకట్టుకొవడంతో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’. ఈ చిత్రంతో సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు