ఇన్నోవేటివ్ పబ్లిసిటీతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’

ఇన్నోవేటివ్ పబ్లిసిటీతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’

Published on Mar 6, 2015 6:40 PM IST

Son-of-Sathyamurthy
ప్రతి సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్, పోస్టర్లు విడుదల చేయడం కామన్. సినిమా థీమ్, అందులో హీరో క్యారెక్టర్ ప్రతిభింబించేలా వీటిని డిజైన్ చేస్తుంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్తగా ఆలోచించారు. ప్రీ ఫస్ట్ లుక్ అంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ప్రీ ఫస్ట్ లుక్ ను హోలీ కానుకగా విడుదల చేశారు. నెటిజన్లను ఈ లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే తరహాలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి ఇన్నోవేటివ్ పబ్లిసిటీ చేయనున్నారని సమాచారం.

దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలను మార్చి 15న విడుదల చేస్తున్నారు. సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు