‘S/O సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్ తేదీ ఖరారు

‘S/O సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్ తేదీ ఖరారు

Published on Apr 1, 2015 1:40 PM IST

Satyamurty
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మార్చి 15న విడుదల చేసిన పాటలు అభిమానుల్లో జోరును నింపింది.

ఇక ఆడియో సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ ఆడియోకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిర్వహించే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఏప్రిల్ 6న విజయవాడలో ఈ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు