ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరగా పాడిన పాట ఇది

ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరగా పాడిన పాట ఇది

Published on Sep 25, 2020 6:16 PM IST

గాన గంధర్వుడు, తన గానామృతంతో సంగీత ప్రియులను కొన్ని 5 దశాబ్దాల పాటు అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం తుది 1:40 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన అస్తమయంతో యావత్ దేశం డిగ్బ్రాంతికి లోనైంది. సంగీత ప్రియులు, అన్ని పరిశ్రమల ప్రేక్షకులు, నటీనటులు, అన్ని రంగాల ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్నారు. బాలుగారు తన సుధీర్ఘ కెరీర్లో 40,000 పాటల వరకు పాడి ఉంటారట. బాలు పాడిన కొన్ని వేల పాటలు ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు, సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమాల్లో ఎస్పీ బాలుగారి చేత ఒక్క పాటైనా పాడించుకోవాలని ఆశపడుతుంటారు.

ఎస్పీబీ గొంతు మూగబోయిన వేళ అభిమానులు ఆయన పాడిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు. కరోనా సోకడంతో ఆగష్టు 5న ఆసుపత్రిలో చేరిన బాలు చివరగా పాట పాడింది రజనీకాంత్ ‘అన్నాత్తే’ చిత్రానికి. రజనీ చేసిన చాలా సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ బాలుగారే పాడటం ఆనవాయితీ. అలా శివ డైరెక్షన్లో చేస్తున్న ‘అన్నాత్తే’లో రజనీ ఇంట్రో సాంగ్ బాలుగారే ఆలపించడం జరిగింది. అలా కన్నుమూయడానికి ముందు బాలుగారు పాడిన చివరి పాట రజనీ ‘అన్నాత్తే’ సినిమాలోదే అయింది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్ స్వయంగా వెల్లడించారు. రజనీకాంత్ సైతం బాలుకు నివాళులు అర్పిస్తూ బాలు తన కోసం చివరగా పాడిన పాటను గుర్తుచేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు