స్పెషల్ కాంటెస్ట్ : అల్లరి నరేష్ సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ మీదే..!

స్పెషల్ కాంటెస్ట్ : అల్లరి నరేష్ సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ మీదే..!

Published on Jul 28, 2014 10:00 PM IST

Allari-Naresh

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా, ‘వీడు తేడా’ ఫేం చిన్ని కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీక నాయర్ అల్లరి నరేష్ సిస్టర్ గా కనిపించనుంది. ‘సుడిగాడు’ సినిమాలో అల్లరి నరేష్ తో జోడీకట్టిన మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ ఈ చిత్ర టీం ఇంకా ఈ సినిమాకి సరిపోయే సరైన టైటిల్ ని మాత్రం ఫైనలైజ్ చేయలేకపోయారు.

దాంతో ఈ కామెడీ ఎంటర్టైనర్ కి సరిపోయే టైటిల్ ని అభిమానుల నుండి, సినీ ప్రేమికుల నుండి మరియు మా 123తెలుగు.కామ్ వీక్షకుల నుండి నుండి తీసుకోవాలని ఈ ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా సెంటిమెంట్ కలగలసిన కామెడీ ఎంటర్టైనర్ కి సరిపోయేలా ఓ సినిమా టైటిల్ ని ఆలోచించి కింద కామెంట్స్ లో తెలపండి. వాటిలో కొన్ని బెస్ట్ టైటిల్స్ ని మేము మీరు చెప్పిన టైటిల్ గనుక అల్లరి నరేష్ టీంకి నచ్చితే మిమ్మల్ని ఈ సినిమా ఆడియో రిలీజ్ కి ఆహ్వానించి అల్లరి నరేష్ ని కలిసే అవకాశం కల్పిస్తారు.

మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్.. మన అల్లరోడి సినిమాకి మంచి టైటిల్ ఆలోచించండి.. ఆ టైటిల్ ని కామెంట్స్ లో తెలపండి.. అల్లరి నరేష్ ని కలిసే అవకాశం కొట్టేయండి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు