అభిమానులకు ‘శ్రీమంతుడు’ స్పెషల్ షోస్!

అభిమానులకు ‘శ్రీమంతుడు’ స్పెషల్ షోస్!

Published on Jul 30, 2015 8:08 PM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇక మహేష్ అభిమానులైతే మొదటిరోజే ఈ సినిమాను చూసేయలని ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీమంతుడు సినిమాకు బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ ప్రత్యేక షోల కోసం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇక రిలీజ్‌కు ముందు రోజు అర్థరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో ఈ స్పెషల్ షోస్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా అమెరికాలోనూ భారీ ఎత్తున ప్రీమియర్ షోలకు రంగం సిద్ధం చేసేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ డైలాగులు, ఆడియోలకు అంతటా మంచి రెస్పాన్స్ వచ్చింది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు