మంచువారింట్లో అన్నప్రాసన

మంచువారింట్లో అన్నప్రాసన

Published on Nov 22, 2014 5:50 PM IST

manchulakshmi

ఈ రోజు మంచు వారికి చాలా సంతోషకరమైన రోజు. నేటితో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ నటుడిగా 40వ పడిలో అడుగుపెట్టారు. ఇదే రోజున మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మి కుమార్తె నిర్వాణ అన్న ప్రాసన కార్యక్రమం జరిగింది. మొదట నగలు, కెమెరాలు చేత పట్టిన నిర్వాణ, చివరకు పెన్ను పట్టుకుంది. దాంతో మంచువారింట్లో ఒక రచయిత ఉదయించనుందా..? అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మంచు లక్ష్మి.

మంచు మోహన్ బాబు నట వారసులుగా చిత్రసీమలో ప్రవేశించిన విష్ణు, మనోజ్, లక్ష్మిలు తండ్రికి తగ్గ పిల్లలగా పేరు తెచ్చుకున్నారు. వీరి ముగ్గురిలో మనోజ్ నటనతో పాటు సంగీతం, సాహిత్య రంగాలలో ప్రవేశం ఉంది. ఒకవేళ మేనకోడలికి మావయ్య లక్షణాలు వచ్చాయేమో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు