‘భరత్ అనే నేను’కు స్పెషల్ పర్మిషన్ !

‘భరత్ అనే నేను’కు స్పెషల్ పర్మిషన్ !

Published on Apr 19, 2018 8:32 AM IST

మహేష్ యొక్క ‘భరత్ అనే నేను’ చిత్రం రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్త్రంగా పెద్ద ఎత్తున విడుదలకానుంది. ఈ సినిమాకు ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి లేదని ముందుగా తెలిపినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 20వ తేదీన ఒక స్పెషల్ షోను వేసుకోవచ్చని అనుమతులిచ్చింది.

20వ తేదీ ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్యలో ఈ స్పెషల్ షో ఉండనుంది. కానీ నైజాంలోనే స్పెషల్ షోలకు అనుమతులు దొరకలేదు. ఇక ఓవర్సీస్లో చూస్తే విడుదల తేదీ ముందురోజు 2000 ప్రీమియర్ షోల ద్వారా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ, మహేష్ ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు