‘స్పైడర్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ !
Published on Jul 30, 2017 6:35 pm IST


మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రానికి సంబందించి అప్డేట్స్ కోసం ఎంతగానో కాచుకుని కూర్చున్న అభిమానులకు వినసొంపైన వార్తను అందించింది టీమ్. అదేమిటంటే ఈ చిత్ర ఆడియోలోని మొదటి పాట ‘బూమ్ బూమ్’ ను ఆగష్టు 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తారట. పాటతో పాటే మేకింగ్ ఎలా జరిగింది అనేది కూడా చూపిస్తారట. ఈ వార్తతో ఫ్యాన్స్ లో కొత్త కోలాహలం నెలకొంది.

ఆ వార్తతో పాటే చిన్నపాటి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుండటంతో పాటు సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ మ్యూజిక్ కూడా కొత్తగా అనిపిస్తోంది. మొత్తం మీద మరో రెండు రోజుల్లో ‘స్పైడర్’ పెద్ద హంగామానే సృష్టించబోతోందని ముందుగానే హింట్ ఇచ్చారు టీమ్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, భరత్ లు ప్రతి నాయకులుగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook