ఈ నెలాఖరున ‘స్పైడర్’ సప్రైజ్ !
Published on Jul 10, 2017 11:41 am IST


మహేష్ బాబు చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పాటల షూటింగ్ జరుగుతుండగా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసింది. ఇక అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న చిత్ర టీజర్ ఈ జూలై నెలాఖరున రిలీజ్ కానుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకు ముందే గ్లిమ్ప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో బయటికొచ్చిన ఒక చిన్నపాటి వీడియో అదరగొట్టే స్థాయిలో ఉండగా టీజర్ ఏ రేంజులో ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

దర్శకుడు మురుగదాస్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులు ఇద్దర్నీ సంతృప్తిపరచే విధంగా సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కథా నాయకిగా నటించగా హారీశ్ జైరాజ్ సంగీతం అందించారు.

 
Like us on Facebook