మహేష్ బాబుతో శ్రీ కాంత్ అడ్డాల తదుపరి సినిమా.?

మహేష్ బాబుతో శ్రీ కాంత్ అడ్డాల తదుపరి సినిమా.?

Published on Oct 19, 2014 7:40 PM IST

srikanth-mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రసతుతం సెట్స్ పై ఉంది. అక్టోబర్ చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి 2015 సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా ఆతర్వాత మహేష్ బాబు చేయనున్న సినిమాలపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పూరి జగన్నాధ్ మహేష్ బాబు కోసం కథని సిద్దం చేసారు. ఇది కాకుండా మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసిన శ్రీ కాంత్ అడ్డాల కూడా తన తదుపరి సినిమా కోసం మహేష్ బాబుని సంప్రదిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

ఇది కాకుండా శ్రీ కాంత్ అడ్డాల వరుణ్ తేజ్ హీరో గా చేసిన ‘ముకుంద’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాని డిసెంబర్ 25నా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది రిలీజ్ అయ్యాకే శ్రీ కాంత్ అడ్డాల తన తదుపరి సినిమా విశేషాలను అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు