ఆగష్టు నుంచి శ్రీశాంత్ మూవీ

ఆగష్టు నుంచి శ్రీశాంత్ మూవీ

Published on Apr 20, 2015 8:28 AM IST

sree-santh1
ప్రముఖ క్రికెటర్ శ్రీ శాంత్ పాళీ వివాదాస్పద గొడవల్లో ఇరుక్కోవడమే కాకుండా, అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి తన క్రికెట్ కెరీర్ ని తన చేజేతులా పాడు చేసుకున్నాడు. దాంతో క్రికెట్ టీం నుంచి తీసేశారు. అలా ఇండియన్ క్రికెట్ టీం నుంచి పక్కకి వచ్చేసినా తనకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవలే శ్రీశాంత్ హీరోగా ఓ తెలుగు సినిమా చేయనున్నాడని తెలియజేశాం. ఈ సినిమాకి మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనున్నాడని కూడా తెలిపాం.

ప్రస్తుతం మధుర శ్రీధర్ ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం శ్రీ శాంత్ సినిమా ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం శ్రీశాంత్ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంది. మే లో తనకి డెలివరీ ఉంటుందని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. డెలివరీ అయ్యాక అన్ని పనులు పూర్తి చేసుకొని సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. క్రికెట్ బెట్టింగ్స్ నేపధ్యంలో జరిగే లవ్ స్టొరీనే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో శ్రీశాంత్ క్రికెటర్ గానే కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు