క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు సినిమా లాంచ్ !

క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు సినిమా లాంచ్ !

Published on Mar 29, 2017 7:28 PM IST


భారత్ క్రికెట్ టీమ్ తరపున బౌలర్ గా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా నటించిన ‘టీమ్ 5’ అనే అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా తెలుగులో ఈరోజే లాంచ్ అయింది. ఈ చిత్రంలో శ్రీశాంత్ సరసన నిక్కీ గల్రాని హీరోయిన్ గా నటించగా ఈ సినిమా మొత్తం ఐదుగురు బైకర్స్ చుట్టూ తిరిగేదిగా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలంటే తనకు చాలా ఇష్టమని, తను క్రికెట్ ఆడే సమయం నుండి తనకు సపోర్ట్ చేస్తున్నారని అన్నాడు.

అదే విధంగా ఇదొక అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ కుటుంబం మొత్తం చూడగలిగే ఫ్యామిలీ డ్రామా కూడా ఇందులో ఉంటుందని ఆయన అన్నారు. ఇకపోతే సురేష్ గోవింద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా రాజ్ జక్రియో నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సెలబ్రిటీ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ సమర్పిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు