మరో తమిళ ప్రాజెక్ట్ కొట్టేసిన శ్రీ దివ్య

మరో తమిళ ప్రాజెక్ట్ కొట్టేసిన శ్రీ దివ్య

Published on Mar 4, 2015 6:13 PM IST

Sri-Divya
‘మనసారా’, ‘బస్ స్టాప్’ చిత్రాల తెలుగు హీరోయిన్ శ్రీదివ్యకి తెలుగులో గుర్తింపు వచ్చినా ఆఫర్స్ మాత్రం తక్కువయ్యాయి. కానీ ఈ భామ తమిళంలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వరుస విజయాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. శ్రీ విద్య తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలిసి నటించిన ‘ఖాకి సట్టై’ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇది కాకుండా జివి ప్రకాష్ కుమార్ తో కలిసి నటించిన ‘పెన్సిల్’ విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే కార్తీ హీరోగా చేయనున్న కాష్మోరా సినిమాకి సైన్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం శ్రీ దివ్య తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని దక్కించుకుంది. శ్రీ దివ్య ఈ సారి రంగం ఫేం జీవ హీరోగా చేయనున్న సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. ది నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి రాజా రాణి ఫేం డైరెక్టర్ అట్లీ అసిస్టెంట్ డైరెక్ట్ చేయనున్నాడు. శ్రీదివ్య ప్రస్తుతం తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న కేరింత సినిమాలో నటిస్తోంది. అలాగే బెంగుళూరు డేస్ తమిళ రీమేక్ కి కూడా సైన్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు