దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు వెళ్ళిన శ్రీదేవి మృతి కేసు !

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు వెళ్ళిన శ్రీదేవి మృతి కేసు !

Published on Feb 26, 2018 7:11 PM IST

ఈ నెల 25 ఆదివారం తెల్లవారుజామున శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ గదిలో మృతి చెందారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడి చట్టాల ప్రకారం కేసు నమోదుచేసుకుని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ముందు నుండి అందరూ ఇది గుండెపోటు వలన జరిగిందని అనుకుంటుండగా ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం స్పృహ తప్పి బాత్‌టబ్‌లోని నీళ్లలో పడి ఊపిరాడక చనిపోయారని, ఇది ఒక ప్రమాదమని పేర్కొన్నారు.

అలాగే ఆమె రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ కూడ ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఈ నివేదిక నమ్మశక్యంగా లేదని, శ్రీదేవి మృతి వెనుకున్న అసలు కారణం వేరే ఏదో ఉందని అభిమానులు సామాజిక్ మాధ్యమాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తుండగా దుబాయ్ పోలీసులు కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారికి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే బనిజమై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును స్వీకరిస్తే అక్కడి చట్టాల ప్రకారం సుస్పష్టమైన దర్యాప్తు చేపడుతుంది. దీని వలన శ్రీదేవి పార్థివదేహం ఇండియాకు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు