స్టడీ కలెక్షన్స్‌తో ‘శ్రీమంతుడు’ హవా

స్టడీ కలెక్షన్స్‌తో ‘శ్రీమంతుడు’ హవా

Published on Sep 3, 2015 12:10 AM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో స్థానంలో నిలబడి మహేష్ స్టామినాను మరోసారి చూపించిన ‘శ్రీమంతుడు’ సినిమా, ఇప్పటికీ అదే కలెక్షన్స్ సాధిస్తూ ఉండడం విశేషంగా కనిపించింది.

ఇక ఎరోస్ ఇంటర్నేషనల్ తెలిపిన వివరాల ప్రకారం 25 రోజుల్లో 150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పొటెన్షియల్‌ను మరోసారి బయటపెట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లోని మహేష్‌కు స్ట్రాంగ్ బాక్సాఫీస్ పొటెన్షియల్ ఉన్న ఏరియాల్లో గత వారాంతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్‌నే సాధిస్తోంది. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక కథాంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు