టీజర్‌తోనే కేక పుట్టించిన ‘శ్రీమంతుడు’!

టీజర్‌తోనే కేక పుట్టించిన ‘శ్రీమంతుడు’!

Published on May 31, 2015 10:27 AM IST

mahesh-sri

మహేష్ అభిమానులకు మే 31న పండగ రోజన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులకు టీజర్ గిఫ్ట్ ఇవ్వడమనేది కొన్నాళ్ళ నుంచి జరుగుతూ వస్తోంది. తాజాగా మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ టీజర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో అభిమానులు ఆనందాల్లో మునిగిపోగా, ఇక ఈ టీజర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మహేష్ బాబు స్టైలిష్ లుక్, మధి టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ కూల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కొరటాల శివ మార్క్ ఈ నిమిషం టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. డైలాగ్ డెలివరీలో మహేష్ బాబు ఏ రేంజ్‌లో అలరిస్తాడన్నది చెప్పక్కర్లేదు. ఈ టీజర్‌లో‍ “ఊరిని దత్తత తీసుకోవడమంటే.. జేబులో డబ్బులు తీసి రంగులు, రోడ్లు వేసి వెళ్ళిపోతాననుకున్నార్రా..” అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్‌గా నిలిచింది. మైత్రీ మూవీస్‌తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే!

‘శ్రీమంతుడు’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు