‘శ్రీమంతుడు’ యూఎస్ కలెక్షన్స్!

‘శ్రీమంతుడు’ యూఎస్ కలెక్షన్స్!

Published on Aug 28, 2015 7:19 PM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తోంది. ఇక మహేష్‌కు అతిపెద్ద మార్కెట్ ఉన్న అమెరికాలోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బాహుబలి తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకొని అమెరికాలో స్ట్రాంగ్‌గా నిలబడ్డ ఈ సినిమా నేడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.

ఇక మూడోవారం ముగిసేసరికి ‘శ్రీమంతుడు’ సినిమా అమెరికాలో 2.84మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇండియన్ రూపాయల్లో ఈ మొత్తం 18.81కోట్లు. ఇక నాలుగో వారాంతం కలెక్షన్స్ ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలవనున్నాయి. నాలుగో వారాంతంతో ఈ సినిమా 3 మిలియన్ డాలర్స్ బెంచ్ మార్క్‌ను కూడా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మహేష్ సూపర్బ్ పర్ఫామెన్స్, కొరటాల శివ టేకింగ్, దేవిశ్రీ మ్యూజిక్, మహేష్-శృతి హాసన్‌ల పెయిర్ శ్రీమంతుడు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు