శ్రీమంతుడు పాటలు ఎప్పుడు వినిపిస్తున్నాడంటే..

శ్రీమంతుడు పాటలు ఎప్పుడు వినిపిస్తున్నాడంటే..

Published on Jul 4, 2015 12:45 PM IST

mahesh-sri

మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు చిత్రం పాజిటీవ్ టాక్ తో శరవేగంగా సాగిపోతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగించుకుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ సినిమా ఆడియోని ఈ నెల 18న విడుదలచేయనున్నట్లు తెలుస్తుంది.

ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేష్ బాబు ఈ చిత్రానికి సహనిర్మాత కావడం విశేషం. కొరటాల శివ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు