10 టికెట్లకె 15వేల డాలర్స్ కలెక్ట్ చేసిన ‘శ్రీమంతుడు’

10 టికెట్లకె 15వేల డాలర్స్ కలెక్ట్ చేసిన ‘శ్రీమంతుడు’

Published on Aug 3, 2015 9:16 PM IST

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే అభిమానులకు అదొక పండుగ. అలా అభిమానులు పండుగ చేసుకోవడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే మహేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు సినిమాలకు లోకల్ లోనే కాదు యుఎస్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహేష్ అన్ని సినిమాలు యుఎస్ లో భారీగా రిలీజ్ అవుతుంటాయి. శ్రీమంతుడు సినిమా కూడా సుమారు 150పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో శ్రీమంతుడు మొదటి 10 టికెట్ల సెల్ తోనే సూపర్బ్ అమౌంట్ ని కలెక్ట్ చేసింది. డెట్రాయిట్ లో మొదటి 10 టికెట్లని 15 వేల డాలర్స్ కి కొనుగోలు చేసి ఓవర్సీస్ లో కలెక్షన్స్ ని స్టార్ చేసారు. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరిన్ నవీన్ ఫ్రెండ్స్ మొదటి 10 టికెట్స్ ని $15,000 కి కొనుగోలు చేసి టికెట్స్ బుకింగ్ ని ప్రారంభించారు. మొదటి 10 టికెట్స్ తోనే రికార్డ్ ప్రైజ్ సాధించిన శ్రీమంతుడు రిలీజ్ అయ్యాక కూడా ఇదే జోరుని కొనసాగించి రికార్డ్ కలెక్షన్స్ ని సాధిస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు ఉదయం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి ఆన్ లైన్ బుకింగ్ లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఓపెన్ చేసిన ప్రతి చోటా హాట్ కేక్స్ లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మహేష్ బాబు – శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు