అన్నయ్య దార్లోనే వెళుతోన్న అల్లు శిరీష్!

అన్నయ్య దార్లోనే వెళుతోన్న అల్లు శిరీష్!

Published on Jul 25, 2016 4:38 PM IST

Srirastu-Subhamastu
అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో, టీజర్ ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలనే రేకెత్తించగా, రేపు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక కొద్దిరోజులుగా ‘శ్రీరస్తు శుభమస్తు’ టీమ్ చేస్తోన్న ప్రమోషన్స్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా ప్రమోషన్స్‌నే ఫాలో అవుతున్నట్లు పక్కాగా చెప్పేయొచ్చు.

అల్లు అరవింద్ కుమారుల్లో మొదటగా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ బాటలోనే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా తన కొత్త సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’కు ఆడియో లాంచ్ నిర్వహించలేదు. నేరుగా మార్కెట్‌లోకి ఆడియోను విడుదల చేసి, ట్రైలర్‌ను, సాంగ్ టీజర్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. ‘సరైనోడు’ సమయంలో బన్నీ చేసిన ఈ ప్రమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడదే కోవలో ‘శ్రీరస్తు శుభమస్తు’కి కూడా ఇది కలిసి వస్తుందని టీమ్ భావిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు