దిల్‌రాజుతో స్టార్ హీరో గొడవ సద్దుమణిగిందట!

దిల్‌రాజుతో స్టార్ హీరో గొడవ సద్దుమణిగిందట!

Published on Dec 8, 2016 11:04 AM IST

RaviTeja-dil-raj
మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో ‘ఒకడొచ్చాడు’ పేరుతో ఒక సినిమా మొదలై, సెట్స్‌పైకి వెళ్ళకుండానే ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే దిల్‌రాజుకు, రవితేజకు పడకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక తాజాగా మళ్ళీ ఈ ఇద్దరూ తమ గొడవలను పక్కనపెట్టేసి ఓ కొత్త సినిమా కోసం కలిసేందుకు సిద్ధమవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. రవితేజకు సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కథ వినిపించగా, ఆయన ఈ కథకు వెంటనే ఓకే చెప్పేశారట.

అనిల్ గత చిత్రం సుప్రీమ్‌ను నిర్మించిన దిల్‌రాజే ఈ సినిమాను నిర్మించనున్నారట. దీంతో రవితేజ, దిల్‌రాజు ఇద్దరూ మళ్ళీ కలిసిపోయినట్టే అని చెప్పుకోవచ్చు. సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత, రామ్‌తో ఓ సినిమా అనుకున్న అనిల్ రావిపూడి, అది సెట్ అవ్వకపోవడంతో రవితేజకు మరో కథ సిద్ధం చేసి ఈ సినిమాను లైన్లో పెట్టారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు