ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి డేట్స్ లేవన్న స్టార్ యాంకర్ !

ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి డేట్స్ లేవన్న స్టార్ యాంకర్ !

Published on Jun 24, 2017 4:12 PM IST


హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘బిగ్ బాస్’ షోను తమిళంలో కమల్ హాసన్, తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభంకానున్న ఈ తెలుగు షోలో పాల్గొనేందుకు స్టార్ యాంకర్ సుమను సంప్రదించారట. కానీ సుమ చాలా సౌమ్యంగా ఆ ఆఫర్ ను తిరస్కరించించారట. వరుస టీవీ షోలతో, ఇతర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉండటమే ఆమె తిరస్కారానికి కారణమట.

ఎందుకంటే బిగ్ బాస్ షో అంటే ఒకటి రెండు రోజుల్లో ముగిసేది కాదు. దానికి ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంటుంది. దాని వలన ఇంతకు ముందే డేట్స్ ఇచ్చిన ఇతర షోలు డిస్టర్బ్ అవుతాయి. అందుకే ఆమె నెమ్మదిగా కాదన్నారట. అలాగే స్టార్ నటుడు పోసానిని కూడా షో నిర్వాహకులు సంప్రదించారట. కానీ ఈ విషయాలపై నిర్వాహక టీమ్ నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమం యొక్క షూటింగ్ ను ముంబైలోని లోనావాలాలో షూట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు