మురుగదాస్‌ స్టార్ హీరోతో సక్సెస్ కొడతాడా ?

మురుగదాస్‌ స్టార్ హీరోతో సక్సెస్ కొడతాడా ?

Published on Mar 22, 2020 1:00 AM IST

తమిళ్ స్టార్ డైరెక్టర్స్ లోనే ప్రత్యేకమైన డైరెక్టర్ గా ఏ.ఆర్. మురుగదాస్ కు మంచి గుర్తింపు ఉంది. ఇక ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ విడుదలకు సిద్దమవుతుండటంతో ఆయన నెక్స్ట్ సినిమా పై చర్చ మొదలైంది. మొదటి నుండి విజయ్ 65వ సినిమా దర్శకుల జాబితాలో ఏ.ఆర్. మురుగదాసే ముందు వరుసలో ఉంది. కాగా తాజాగా తమిళ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ – మురగదాస్ కాంబినేషన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే రజనీతో ‘దర్బార్’ చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకుని ఫామ్లోకి వచ్చారు మురుగదాస్.

పైగా గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీరిది క్రేజీ కాంబినేషన్ అయింది. ఈ కాంబినేషన్ నాల్గవసారి రిపీట్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ చిత్రం కూడా ‘తుపాకి’ తరహాలో ఉంటుందట. ఈ సినిమా నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మరి ఈ సారి కూడా ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు