పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్ ?

Koratalla-Siva
ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతంగా పాపులర్ అయినా డైరెక్టర్ ఎవరంటే సందేహం లేకుండా వచ్చే జవాబు ‘కొరటాల శివ’. ప్రభాస్ తో ‘మిర్చి’, మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కొరటాల తారక్ తో ‘జనాల గ్యారేజ్’ చిత్రం తీసి టాప్ దర్శకుల్లో ఒకడిగా నిలబడిపోయాడు. ఈ సక్సెస్ తరువాత పలు ఇంటర్వ్యూల్లో అందరు స్టార్ హీరోలతో సినిమా తీస్తానన్న ఈయన ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

సోషల్ ఎలిమెంట్ ను స్ట్రైకింగ్ గా చెప్పడం కన్నా పెద్ద కమర్షియల్ పాయింట్ ఇంకొకటి లేదని నమ్మే శివ సోషల్ సబ్జెక్ట్స్ ను ఎక్కువగా ఇష్టపడే పవన్ కోసం మంచి సామాజిక సందేశం ఉన్న కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్లో మరో సెన్సేషన్ రూపుదిద్దుకోవడం ఖాయమని చెప్పొచ్చు. కానీ ఈ విషయంపై పవన్, కొరటాల నుండి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రసుతం శివ తరువాతి సినిమాను మహేష్ బాబుతో చేయాలని కమిటైన సంగతి తెలిసిందే.

 

Like us on Facebook