పవన్ సినిమాలో కీ రోల్ చేయనున్న స్టార్ హీరో !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలుంటాయో వేరే చెప్పనక్కర్లేదు. ఆ స్థాయిని అందుకునేందుకు ఆయా చిత్ర దర్శకులు శత విధాలా ప్రయత్నిస్తుంటారు. ప్రేక్షకుల్ని సంతృప్తి పరచేందుకు అందుబాటులో ఉన్న అన్ని దారుల్ని ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ అదే పనిలో ఉన్నారు. పవన్ తో తాను చేస్తున్న సినిమాలో మరింత కిక్ ఉండేలా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ను నటింపజేస్తున్నారు.

ఇన్నాళ్లు ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన టీమ్ ఈరోజు వెంకీకి సంబందించిన షూటింగ్ ను కూడా జరిపిండనై తెలుస్తోంది. అంతేగాక వెంకీ రోల్ మంచి ఎంటర్టైనింగా ఉంటుందని కూడా తెలుస్తోంది. గతంలో కూడా కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించి అభిమానుల్ని అలరించిన వెంకటేష్, పవన్ లు ఈసారి ఏ స్థాయిలో హుషారెత్తిస్తారో చూడాలి. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితవమవుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Like us on Facebook