రజనీకి ప్రతినాయకుడిగా స్టార్ హీరో !

రజనీకి ప్రతినాయకుడిగా స్టార్ హీరో !

Published on Apr 26, 2018 11:42 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఈ సినిమాలో ప్రసుతం తమిళ పరిశ్రమలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. అది కూడా ప్రతినాయకుడి పాత్రలో కావడం విశేషం. ఇలా సేతుపతి చేరికతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. సేతుపతి, కార్తిక్ సుబ్బరాజ్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు గతంలో ‘పిజ్జా, ఇరైవి, బెంచ్ టాకీస్’ వంటి హిట్ సినిమాలు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు