ఇంకో రెండు సీక్వెల్స్ తీస్తానంటున్న స్టార్ హీరో !
Published on Jul 10, 2017 3:32 pm IST


తెలుగులో సైతం మంచి మార్కెట్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన ‘విఐపి -2’ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లో రిలీజ్ కానుంది. 2014లో వచ్చిన ‘విఐపి’ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ వీఐపీ ప్రాంచైజీలో ‘విఐపి-3, విఐపి-4’ అనే ఇంకో రెండు సీక్వెల్స్ వస్తాయని ధనుష్ తెలిపారు.

విఐపి-2 తో తమిళంలోకి చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కాజోల్ మూడువ పార్ట్ లో కూడా ఉంటారని అన్నాడు. అంతేగాక దర్శకుడిగా తన మొదటి చిత్రం ‘పా పాండి’ కి కూడా సీక్వెల్ చేస్తానని ధనుష్ ప్రకటించాడు. ధనుష్ ఇలా మూడు కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించడంతో ఆయన అభిమానులు కోలాహలంగా ఉన్నారు. ఇకపోతే ధనుష్ రజనీకాంత్ చేస్తున్న ‘కాల’ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

 
Like us on Facebook