సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో సోదరి

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో సోదరి

Published on Apr 25, 2018 5:48 PM IST

హీరోయిన్ రెజీనా కెసాండ్రా ప్రస్తుతం మిస్టర్ చంద్రమౌళి అనే ఒక తమిళ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో ఈవెంట్ నేడు చెన్నైలో చిత్ర యూనిట్ సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా హీరో సూర్య సోదరి బృంద సింగర్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.

ఒకప్పటిసీనియర్ హీరో కార్తీక్, ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ కలిసి ఈ చిత్రంలో నటించిన ఒకపాటను ఆమె పాడారు. అలానే సిఎస్ సామ్ సంగీతం అందించి, విద్య దామోదరన్ రాసిన ఈ చిత్ర టైటిల్ ట్రాక్ ని కూడా ఆమె పాడారట. ఇది నిజంగా హీరోలు సూర్య, కార్తీ గర్వపడవలసిన విషయమని, ఎందుకంటే మరొక మంచి టాలెంటెడ్ సింగర్ తమ సోదరి రూపంలో తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని అంటున్నారు చిత్ర యూనిట్….

సంబంధిత సమాచారం

తాజా వార్తలు