జల్లికట్టుకి పెరుగుతున్న స్టార్ హీరోల మద్దత్తు !

జల్లికట్టుకి పెరుగుతున్న స్టార్ హీరోల మద్దత్తు !

Published on Jan 17, 2017 10:35 PM IST

suriya-vijay
తమిళనాట ఆందోళనకరంగా మారిన జల్లికట్టు ఉద్రిక్తకరంగా మారింది. వేలాది మంది సపోర్టర్లు జల్లికట్టుపై నిషేధం ఎత్తి వేసి, తమిళ సాంప్రదాయాన్ని కాపాడాలని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. తమిళనాట మధురై వంటి జిల్లాలో సైతం పరిస్థితి ఇలానే ఉంది. ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమను సైతం తాకింది. స్టార్ హీరోలని వాళ్ళ అభిమానులు జల్లికట్టుకు మద్దతివ్వాలని కోరారు. దానికి అనుగుణంగానే రజినీకాంత్, కమల్ హాసన్, శింబు, జీవి ప్రకాష్ వంటి వారు ఇప్పటికే మద్దతిచ్చి చ్చారు. కొందరు హీరోలు ఆందోళనలో సైతం పాలుపంచుకుంటున్నారు.

తాజాగా ఈరోజు ఆ మద్దత్తు ఇంకా పెరిగింది. తమిళనాట కోట్లాది మంది అభిమానులున్న స్టార్ హీరో విజయ్ జల్లికట్టుకి మద్దత్తు తెలుపుతూ, అది తమిళ సంప్రదాయంలో భాగమని ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తువేస్తే అందరూ సంతోషిస్తారని, పెట సంస్థ కూడా తమ నిరసనను ఆపాలని అన్నారు. అలాగే మరో స్టార్ హీరో సూర్య సైతం జల్లికట్టు కోసం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పోరాడటం బాగుంది. పెట ఈ పోరాటంలో గెలిచినా ప్రజల పోరాటంలో న్యాయముందనేది నిజం. ఖచ్చితంగా ప్రజలు గెలుస్తాం. ఇదొక్కటే కాదు సాంప్రదాయాన్ని కించపరిచే ప్రతి అంశానికి వ్యతిరేకంగా మనమంతా పోరాడాలి అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు