పవన్ – క్రిష్ సినిమాలో అనుష్క.. నిజమేనా ?

పవన్ – క్రిష్ సినిమాలో అనుష్క.. నిజమేనా ?

Published on Apr 5, 2020 4:36 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ పార్ట్ ను చాల వరకు పవన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. అయితే క్రిష్ – పవన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దాని పై చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి లాక్ డౌన్ లో కూడా మరో పేరు తెర పైకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా అనుష్క నటిస్తోందట, మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు