వరుస ఆఫర్లతో బిజీగా మారిన స్టార్ హీరోయిన్ !

వరుస ఆఫర్లతో బిజీగా మారిన స్టార్ హీరోయిన్ !

Published on Feb 26, 2017 6:39 PM IST


దాదాపు దశాబ్ద కాలం పాటు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష మధ్యలో కాస్త వెనుకబడినా మళ్ళీ పుంజుకుని ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఈ మధ్యే విక్రమ్ – హరిల ‘సామి 2’ లో ఛాన్స్ కొట్టేసిన ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ మరో 6 సినిమాలలో నటిస్తోంది. వాటిలోఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఉండటం విశేషం.

ఒకరకంగా త్రిష గ్లామర్ రోల్స్ కి చెక్ పెట్టి నటనకు పూర్తి ఆస్కారమున్న కథలపై మొగ్గుచూపడమే ఆమెకు వరుస ఆఫర్లు రావడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈమె ‘మోహిని, శతురంగవెట్టై, 1818, 96, ఘర్ జానై’ లతో పాటు ఒక నివిన్ పౌలి హీరోగా చేస్తున్న మలయాళ చిత్రంలో సైతం నటిస్తోంది. ఇవే కాక ఆమె వద్ద ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని ఇంకొన్ని నెలల్లో మరిన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు