ప్రభాస్, విక్రమ్ లను ఎంచుకున్న స్టార్ హీరోయిన్ !
Published on Jul 2, 2017 6:32 pm IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ తాజాగా అబుదాబీలో జరుగుతున్న సైమా అవార్డ్స్ వేడుకలో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పటికే తెలుగులో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ వంటి సినిమాల్ని చేసిన ఆమె తిరిగి తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తే ప్రభాస్ తో సినిమా చేస్తానని అంది.

అంతేగాక ‘బాహుబలి’ లో ప్రభాస్ చాలా బాగా నటించాడంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఒకవేళ తమిళంలో సినిమా చేయాలనుకుంటే స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో చేయాలని ఉందని తన తెలిపారు. ప్రస్తుతం ఈమె హిందీలో ‘జగ్గా జాసూస్, టైగర్ జిందా హై’ వంటి సినిమాలతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

 
Like us on Facebook