చైతు, వెంకీల సినిమాలో స్టార్ హీరోయిన్ !

చైతు, వెంకీల సినిమాలో స్టార్ హీరోయిన్ !

Published on May 19, 2018 10:46 AM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యల కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేయనున్నారు. జూన్ నెలలో ఈ సినిమా లాంచ్ కానుంది. ఇందులో చైతన్యకు జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుంటున్నారట. ఒక నెల రోజుల నుండి ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో రకుల్ ప్రీత్, నాగ చైతన్యలు కలిసి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే వెంకీ సరసన కథానాయకిగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రాన్ని కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు