హీరోయిన్ భావన నేటి ఉదయం కిడ్నాప్ కు గురయ్యారు. ఆమె కిడ్నాప్ కి గురి కావడంతో సినీవర్గాల్లో సంచలనం రేపింది. కేరళలో ఎర్నాకుళంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న భావన కారులోకి ఎవరో దుండగులు ప్రవేసించి ఆమె కారుని దారిమళ్లించారు. దాదాపు 25 కిలోమీటర్లు దూరం తీసుకుని వెళ్లాక ఆమెపై లైంగిక వేధింపులు చేసినట్లు చేసారని పోలీస్ లు తెలిపారు.
ఆమెని కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీసి నిందితులు అక్కడి నుంచి వేరే కారులో పరారైనట్లు తెలుస్తోంది. ఘటన తరువాత భవన పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. కాగా ఇద్దరు నిందితులలో ఒకరు గతంలో భావన వద్ద కారు డ్రైవర్ గా పనిచేయగా, మరో వ్యక్తి కూడా భావన వద్ద పని చేసినట్లు పోలీస్ లు తెలిపారు. డ్రైవర్ గా పనిచేసిన మార్టిన్ ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ లు వెల్లడించారు. కాగా భావన తెలుగు, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ వంటి చిత్రాల్లో భావన నటించింది.
- విడుదల తేదీ వార్తల్ని ఖండించిన విశాల్ !
- ‘రంగస్థలం’కు షోల సంఖ్యలో పెంపు !
- రెండున్నరకు దగ్గర్లో మహేష్, మూడున్నరకు చేరువలో చరణ్ !
- ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వివరాలను బయటపెట్టిన దేవరకొండ !
- కృష్ణా, గుంటూరు జిల్లాలో ‘భరత్ అనే నేను’ వసూళ్ల వివరాలు !
సంబంధిత సమాచారం :
