Like us on Facebook
 
తన కిడ్నాప్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ !


ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, ప్రస్తుతం తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదగగల సత్తా ఉన్న హీరోయిన్ వరలక్ష్మి ఈరోజంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. పొద్దుపొద్దున్నే వరలక్ష్మి కిడ్నాప్ కు గురైందంటూ ఒక వార్త తమిళ మీడియాలో దర్శనమిచ్చింది. దాంతో పాటే వరలక్ష్మిని తాళ్ళతో కట్టేసి, నోటికి గుడ్డ కట్టి ఉన్న ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో అందరూ వరలక్ష్మి కిడ్నాప్ కు గురైందని అనుకున్నారు.

చాలాసేపటి వరకు ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ కిడ్నాప్ నిజమేనని అందరూ నమ్మేశారు. ఆమె అభిమానులైతే సోషల్ మీడియాలో వరలక్ష్మి కిడ్నాప్ పేరుతొ హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేసి పెద్ద దుమారమే లేపారు. ఇలా గందరగోళం నడుస్తుండగా 11 గంటల 49 నిముషాల సమయంలో తనకేం కాలేదని.. ఈయనపై ఇంత శ్రద్ద చూపిస్తున్నటుకు థ్యాంక్స్ అని, ఇదొక సినిమా ప్రమోషన్లో భాగమని, సాయంతరం 6 గంటలకి సినిమాపై ప్రకటన చేస్తానని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కాస్త కోపగించుకుంటూనే హమ్మయ్య అనుకున్నారు. ఆ తర్వాత ఇది తనకు తెలీకుండా జరిగిందని, ఇది జరిగేటప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని, ఇబ్బంది పెట్టిందకు సారీ అని వివరణ కూడా ఇచ్చారు.

Bookmark and Share