దర్శకుడి మీద ప్రసంశల వర్షం కురిపించిన స్టార్ హీరోలు !

దర్శకుడి మీద ప్రసంశల వర్షం కురిపించిన స్టార్ హీరోలు !

Published on Apr 25, 2017 5:48 PM IST


అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు పరిశ్రమలోని స్టార్ దర్శకుల జాబితాలో ముందుండే దర్శకుల్లో సీనియర్ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. ‘సప్తపది, సాగర సంగమం, శంకరాభరణం, ఆపద్బాంధవుడు, స్వర్ణ కమలం, స్వాతి ముత్యం’ వంటి ఆల్ టైమ్ క్లాసికల్ హిట్లను మనకందించిన ఆయన కృషికి ఫలితంగా భారత ప్రభుత్వం సినీ రంగంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ పాల్కే అవార్డును నిన్ననే ఆయనకు ప్రటించారు.

దీంతో తెలుగు పరిశ్రమ మాత్రమేగాక యావత్ దక్షిణ భారత సినీ పరిశ్రమ పులకించిపోయింది. స్టార్ స్టార్ హీరోలంతా కళాతపస్విని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా విశ్వనాధ్ గారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న నటుడు కమల్ హాసన్ అయితే విశ్వనాధ్ గారిలాంటి గొప్ప దర్శకుడు దొరకడం భారతదేశ అదృష్టం అంటే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆత్మేయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు ఆయనకు అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది పరిశ్రమ గర్వించదగిన అంశమని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు