మీ ఊరికే రానున్న ‘స్టార్ మహిళ’ సెలక్షన్స్

మీ ఊరికే రానున్న ‘స్టార్ మహిళ’ సెలక్షన్స్

Published on Oct 2, 2014 6:16 PM IST

star_mahila
ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట అయితే చాలు మహిళా ప్రేక్షకులంతా టీవీ ముందు కూర్చొని గంటపాటు సరదాగా ఎంజాయ్ చేసే ప్రోగ్రాం ‘స్టార్ మహిళ’. ఈ టీవీలో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రాం కి ఫేమస్ యాంకర్ సుమ కనకాల. ఈ ప్రోగ్రాం లో పాల్గొనాలని చాలా మంది మహిళలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ స్టార్ మహిళా సెలక్షన్స్ ఎక్కడ జరుగుతాయో ఏమో అని కొందరు అనుకుంటే కొందరేమో హైదరాబాద్ వరకూ రాలేక ఈ షో లో పార్టిసిపేట్ చేసే అవకాశం మిస్ అవుతూ ఉంటారు.

అలాంటి వారి కోసం ఇప్పుడు స్టార్ మహిళ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అదే మీ ఊరికే వచ్చి స్టార్ మహిళ కోసం సెలక్షన్స్ నిర్వహించడం. ఈ నెల 7న విశాఖపట్నం, 9న రాజమండ్రి, 12న విజయవాడలలో మా టీం సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించనున్నారు, వెన్యూ వివరాల కోసం కింద ఇచ్చిన ఫొటోస్ లో చూడగలరు…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు