ప్రభాస్ సినిమా కోసం ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

ప్రభాస్ సినిమా కోసం ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

Published on May 26, 2020 7:10 PM IST

టాలీవుడ్ డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వింటేజ్ ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా విషయంలో మిస్టరీగా ఉన్న పలు అంశాలలో ఈ చిత్ర సంగీత దర్శకుని అంశం కూడా ఒకటి.

ఈ చిత్రం మొదలు పెట్టి చాన్నాళ్లు అయినా ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎవరు సంగీతం అందిస్తారు అన్న విషయం క్లారిటీ రాలేదు. ఇలాంటి ప్రాజెక్ట్ కు సంగీతం చాలా కీలకం కావడం వలన మేకర్స్ మొదట స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పేరును అనుకున్నారని టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ 20 మేకర్స్ రెహమాన్ పేరునే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ మిస్టరీ అంశానికి అతి త్వరలోనే తెర పడనుంది అని చెప్పాలి. మొట్ట మొదటి సారి ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు