బాలీవుడ్‌కు వెళ్ళనున్న ‘పెళ్ళిచూపులు’..!

బాలీవుడ్‌కు వెళ్ళనున్న ‘పెళ్ళిచూపులు’..!

Published on Oct 12, 2016 12:54 PM IST

Pellichoopulu
ఈ ఏడాది జూలై నెలలో విడుదలైన ‘పెళ్ళిచూపులు’ అనే సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న సినిమా ఊహకు కూడా అందని స్థాయిలో వసూళ్ళు రాబట్టడం ‘పెళ్ళిచూపులు’ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.

దీంతో తెలుగులో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ఆయా సినీ పరిశ్రమల నిర్మాతలు పోటీ పడ్డారు. తాజాగా హిందీలో పెళ్ళిచూపులు సినిమాను రీమేక్ చేసేందుకు గానూ వశూ భగ్నాని భారీ మొత్తానికి హక్కులను సొంతం చేసుకున్నారట. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవర కొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించారు. హీరో ఫ్రెండ్ కౌశిక్ అనే పాత్రలో నటించిన ప్రియదర్శి పెళ్ళిచూపులు తర్వాత హాట్ టాపిక్‌గా మారిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు