హైదరాబాద్ డ్రగ్ మాఫియాపై కోన వెంకట్ మూవీ

హైదరాబాద్ డ్రగ్ మాఫియాపై కోన వెంకట్ మూవీ

Published on Nov 29, 2015 9:53 AM IST

kona-venkat
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ స్టార్ రైటర్స్ లో కోన వెంకట్ ఒకరు.. ఆయన పలు పెద్ద సినిమా కథలు రాస్తూనే తనకు నచ్చిన సినిమాలు కూడా తీయాలని నిర్మాతగా మారి, ఆ సినిమాలకు కథ – కథనం తనే అందిస్తూ సినిమాలు చేస్తున్నాడు. అలా చేసిన ‘గీతాంజలి’ సినిమా గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. అదే విధంగా కోన వెంకట్ చేసిన మరో ప్రయత్నమే శంకరాభరణం’. యంగ్ హీరో నిఖిల్, నందిత జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోన వెంకట్ తన తదుపరి సినిమా కోసం ఓ రియల్ స్టొరీని తీసుకున్నానని తెలియజేశాడు. హైదరబాద్ డ్రగ్ మాఫియా నేపధ్యంలో తన తదుపరి సినిమా కథని సిద్దం చేసుకుంటున్నానని, ఇటీవలే హైదరాబాద్ సీనియర్ సిటీ పోలీస్ లని కలిస్తే వారు డ్రగ్ మాఫియా నేపధ్యంలో చేతులు మారుతున్న కొన్ని కోట్ల రూపాయల గురించి ఇచ్చిన సమాచారం తనని షాక్ చేసిందని, అందుకే హైదరాబాద్ డ్రగ్ మాఫియా నేపధ్యంలో సినిమా చేయనున్నానని కోన వెంకట్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘పౌడర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కోన నిర్మించనున్న ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించే ఆలోచనలో కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు