బోయపాటి సినిమాలో ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లు !

బోయపాటి సినిమాలో ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లు !

Published on Mar 23, 2017 2:07 PM IST


బోయపాటి సినిమా అంటేనే భారీ సెట్టింగులతో, స్టార్ కాస్ట్ తో నిండిపోయి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పాత్ర ఎంత చిన్నదైనా అది కథను ప్రభావం చేస్తుంది అనుకుంటే బోయపాటి అందులో బాగా తెలిసిన నటుల్నే ఉంచుతాడు. ఆ లక్షణం ప్రకారమే ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రీనివాస్ తో కలిపి వివిధ పాత్రలు కోసం మొత్తం ఆరుగురు హీరోలు, ప్రధాన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లను నటింపజేస్తున్నాడట.

ముందుగా హీరోల విషయానికొస్తే శ్రీనివాస్ కాకుండా ఒకప్పుడు హీరోలుగా చేసిన జగపతిబాబు, శరత్ కుమార్, లతో పాటు నందు, ‘సై’ ఫేమ్ శశాంక్ లు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్లలో రకుల్ ను పక్కనబెడితే మరొక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, ఒక స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్ థ్రెస, మరికొన్ని ముఖ్యపాత్రలు కోసం అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాధ్, ‘భీమవరం బుల్లోడు’ ఫేమ్ ఎస్తర్ నొరోన్హా, మరియు సితారలు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు