స్టార్ సెంటిమెంట్ : ఫస్ట్ అబ్బాయి పుడతాడు (పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ)

స్టార్ సెంటిమెంట్ : ఫస్ట్ అబ్బాయి పుడతాడు (పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ)

Published on Jul 22, 2014 3:47 PM IST

stars
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్… ప్రజెంట్ జనరేషన్ స్టార్ హీరోలు. సినిమాల పరంగా ఎవరి స్టైల్ వారిదే. కాని ఈ యంగ్ హీరోలందరిలో రెండు విషయాలు మాత్రం కామన్. ఒకటి… వారసులుగా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు, స్టార్ హీరోలుగా అనేక మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రెండవ విషయం…. వీరి తోలి సంతానం మగ బిడ్డ.

పవన్ కళ్యాణ్ – అకిరా నందన్, మహేష్ బాబు – గౌతమ్ కృష్ణ, అల్లు అర్జున్ – అల్లు అయాన్, నేడు ఎన్టీఆర్ – స్వీట్ లిటిల్ క్యూట్ బాయ్. ఇలా నలుగురు స్టార్ హీరోలకు మొదట అబ్బాయి పుట్టడం విశేషం. యాదృశ్చికమే అయినా ఇది సత్యం. ప్రస్తుతం ఆయా స్టార్ హీరోల అభిమానులు అనందంలో మునిగితేలుతున్నారు. అప్పుడే ఈ లిటిల్ క్యూట్ బాయ్స్ ను ఫ్యూచర్ స్టార్ హీరోలుగా వర్ణిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తోలి సంతానం కూడా అబ్బాయే. నవతరం హీరోలకు ఇదొక ఆనవాయితి అనుకోవాలేమో..!

సెంటిమెంట్ ను బాగా ఫాలో అయ్యే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగతా యంగ్ హీరోలకు కూడా మొదట అబ్బాయి పుడతాడు అంటూ జోస్యం చెప్తున్నారు. యంగ్ హీరోలలో రామ్ చరణ్, గోపీచంద్ లకు పెళ్లైంది. ప్రభాస్, రానా, నాగ చైతన్య, మంచు మనోజ్, రామ్, నితిన్ తదితర హీరోలు పెళ్ళికి సిద్దం అవుతున్నారు. వీరికి మొదట అమ్మాయి పుడుతుందో..? లేక అబ్బాయి పుడతాడో..? వేచి చూడాలి.

పవన్, మహేష్, కళ్యాణ్ రామ్ ల రెండవ సంతానం అమ్మాయి కావడం మరో విశేషం. మంచు విష్ణు దంపతులు మాత్రం తోలి కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. మహాలక్ష్మి లాంటి ఇద్దరు అమ్మాయిలు వారి ఇంట అడుగుపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు